పంటనష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
హుజురాబాద్, జనంసాక్షి: వడగండ్ల వానతో హుజురాబాద్ నియోజకవర్గంలో నష్టపోయిన వరి పంట పొలాలను తెరాస శాసనసభాపక్షనేత, స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరిశీలంచారు. నేలవాలిన, దెబ్బతిన్న వరి ధాన్యాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న వరిపంటకు ప్రభుత్వం చెల్లించే పరిహారం కనీసం దున్నే ఖర్చులకు కూడా సరిపోవని ఇదో కంటితుడుపు వ్యవహారంగా మారిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు చెల్లించాలని, భీమా ద్వారా రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యక్రమంలో పాల్గొన్నారు.