పంటల నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట కలెక్టరేట్ ( జనంసాక్షి ):                పంటల దిగుబడిని విశ్వసనీయంగా అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు నిర్వహించిన పంట కోత ప్రయోగాల ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంటకోత ప్రయోగాలను ప్రతి ఒక్కరు సక్రమంగా నిర్వహించాలని, అలాగే ఖచ్చితమైన సమాచారంతో పంటకోత ప్రయోగముల ఫారాలను నింపి సకాలంలో వాటిని పంపాలని కలెక్టర్ ప్రణాళిక ,  గణాంక అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు తెలిపారు.వ్యవసాయ విస్తరణ అధికారులు సకాలంలో పంటల వివరాలను నమోదు చేయడం వలన పంటల దిగుబడిని విశ్వసనీయంగా అంచనా వేయడం ద్వారా జిఎస్ డిపి, జాతీయోత్పత్తిని అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు పంట కోత ప్రయోగాలను నిర్వహించుటకు పంటల వద్దకు గణాంక అధికారులు ,వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చినప్పుడు రైతులు అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు.పంటల నమోదు ప్రక్రియ సక్రమంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఓ గూడ వెంకటేశ్వర్లు , జిల్లా వ్యవసాయ అధికారి డి.రామారావు నాయక్ , జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బి.శ్రీధర్,డి శ్యామ్, వ్యవసాయ సహాయ సంచాలకులు,ఉపగణాంక అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area