పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
టీపీసీసీ నాయకులు వై.నరోత్తం
జహీరాబాద్ అక్టోబర్ 17( జనంసాక్షి)పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి అని టీపీసీసీ నాయకులు వై.నరోత్తం అన్నారు. సోమవారం వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలను పార్టీ నాయకులతో కలిసి పంట పొలాల్లో పర్యటించి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలో రైతులు సుమారు 60,000 ల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సుమారు 50% పంట నష్టం జరిగింది అన్నారు. పోలంలో నీళ్లు నిలబడి, పత్తి పువ్వు పై వర్షపు నీరు పడి మొత్తం నల్లగా మారిపోయింది దింతో పత్తి దిగుబడి తగ్గి, రంగు మారిన పత్తికి సరైన ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు.,అలాగే 48,000ల ఎకరాలలో సొయా పంటను పండించారు ఈ పంట కూడా వర్షాల వల్ల పొలాల్లో నీళ్లు నిలబడి వర్షాలకు సుమారు 25% పంటకు నష్టం జరిగింది,రైతులు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇతరుల దగ్గర వడ్డీకి అప్పులు తెచ్చి దుక్కిదున్ని పంటలు వేస్తారు అవి మొలకెత్తగానే కలుపుతీతకు, పై పిచికారీ మందులకు, ఎరువులకు,ఇలా రైతులు ఎకరానికి సుమారు 50,000 వేల వరకు ఖర్చు పెట్టి ఆశతో ఎదురుచూస్తుంటే అకాల వర్షాల వల్ల పంట నష్ట పోయి రైతులు అప్పుల పాలు అవుతున్నారు, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు,రైతు భీమా, అని ఇస్తూ చేతులు దులుఫుకుంటే సరిపోదు,ఇప్పటికే రుణమాఫీ అని చెప్పి రైతులకు రుణమాఫీ చేయక పోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు,కేవలం మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం కాదు,ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను అధికారులచే పూర్తి స్థాయిలో సర్వేలు చేయించి పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు యం.డి.యూసుఫ్,ప్రకాష్,చెంగల్ జైపాల్,రైతు ఉన్నారు