పండగల సంబరాలపై ఒమిక్రాన్ దెబ్బ !
ఒమైక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో మళ్లీ ఆంక్షల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిరది. ఇప్పటికే అనేక రాష్టాల్రు ఆంక్షలు విధించాయి. దీంతో వరుసగా వస్తున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా ఒకేచోట వేల మంది గుమిగూడే పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కూడా ఆయా రాష్టాల్రకు సూచించింది. ఈ క్రమంలో ఇక పండగల వేళ మల్లీ సందడి లేకుండా పోయే రోజులు వచ్చాయి. తెలుగు రాష్టాల్ల్రో సంక్రాంతిపైనా దీని ప్రభావం కానరానుంది. అంతకు ముందే న్యూ ఇర్ వేడుకలపైనా ప్రభావం తీవ్రం కానుంది. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు అవకాశం ఉండకపోవచ్చు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. దీంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుక లపై తీవకర ప్రభావం పడిరది. ఇది ఓ రకంగగా చిన్న వ్యాపారుకలు తీరని దెబ్బ. పండగల వేళ ఆంక్షలతో వ్యాపారాలు దెబ్బతిని వారు పస్తులుండే దుస్థితి దాపురించింది. ఇప్పటికే కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాన హైకోర్టు రాష్టాన్న్రి ఆదేశిం చింది. మరోవైపు కేంద్రం కూడా ఇదే పద్దతిలో పరోక్ష హెచ్చరికలు చేసింది. కోవిడ్ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను నియమించిందని తెలిపింది. అన్ని రాష్టాల్రతో ఆ బృందాలు చర్చలు జరుపుతున్నా యి. కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవాలి. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను తాము స్వయంగా పర్యవేక్షిస్తామని ధర్మాసనం తెలిపింది. ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్ననందున ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు జరపాలని, ఇతర జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. పండుగలకు పెద్ద ఎత్తున జనం గ్రామాలకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించింది. గ్రామాలకు వెళ్లేవారు జగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను వందశాతం అమలు చేయాలని చెప్పింది. మహారాష్ట్ర, ఢల్లీి,కర్నాటక వంటి రాష్టాల్రు ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు విధించాయి. ధర్మాసనం గుర్తు చేసింది. మొత్తంగా ఇప్పుడు తాజా పరిస్థితులను చూస్తుంటే మూడో ముప్పు కళ్లముందే కనిపిస్తోంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలు కూడా కళతప్పనున్నాయి. దీంతో ప్రజలకు ఈ యేడు కూడా నూతన సంవత్సరం చేదు గుళికలను మింగేలా చేస్తోంది. విందులు.. వినోదాలు..ఆటపాటలు… కానరాకపోవచ్చు. మందుబాబులకు మళ్లీ నిరాశే ఎదురు కానుంది. సెలబ్రిటీలు,నటులతో ప్రత్యేక కార్యక్రమాలు.. డీజే సౌండ్లతో యువత డ్యాన్సులు.. కేకుల సందడి,యువత కేరింతలకు ఇక అవకాశం లేదనే భావించాలి. ఏటా డిసెంబర్ 31 వచ్చిందంటే న్యూ ఇయర్ వేడుకల సందడి జోరుగా ఉండేది. గతేడాది కూడా ఇలాంటి అవకాశం లేకుం డా పోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల కళ పూర్తిగా తప్పిందనే చెప్పాలి. డిసెంబర్ 31 దగ్గర పడుతున్నా ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు. ఈపాటికే స్టార్ హోటళ్లు.. ఈవెంట్లు సంస్థలు అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలకు రకరకాల ప్యాకేజీలు, ఆఫర్లతో బుకింగ్‌లు మొదలు పెట్టేవి. విందులు, వినోద ఈవెంట్లతో సందడి చేసేవి. కానీ సరిగ్గా కొత్త సంవత్సరం ప్రారంభానికి మరో వారం రోజుల ముందే ఒమిక్రాన్ సందడి మొదటు పెట్టింది. ఈసారి ఒమైక్రాన్ వైరస్ దడ పుట్టిస్తోంది. గతేడాది ఇదే సమయానికి కొవిడ్ తొలి వేవ్ చుట్టేయడంతో కొత్త సంవత్సర వేడుకలు రద్దయ్యాయి. ఈసారి కేసులు బాగా తగ్గిపోయి అన్నీ సద్దుమణిగి పోతున్నాయనుకునేలోపు మళ్లీ ఇప్పుడు ఒమైక్రాన్ వణుకుతో వేడుకల ఆశలపై నీళ్లు చల్లాయి. కరోనాకు ముందు నగరాలతోపాటు, పట్టణాల్లోను స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ సంస్థలు విందులు, వినోదాలు భారీగా ఏర్పాటు చేసేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఒమైక్రాన్ వైరస్ వేరియంట్ వణికి స్తుండంతో కొత్త సంవత్సర వేడుకల కళ పూర్తిగా తప్పిపోయింది. దీంతో ఎక్కడా న్యూఇయర్ వేడుకల సందడి కనిపించడం లేదు. స్టార్ హోటళ్ల దగ్గర నుంచి ఓ మోస్తరు రెస్టారెంట్ల వరకు రకరకాల విందులు, వినోదాలు ఏర్పాటుచేసేవి. డీజే బృందాలతోపాటు సినీ నటులను తీసుకువచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవి. మందుబాబులకు అన్‌లిమిటెడ్ మద్యం ఆఫర్లు.. భోజన ప్రియులకు రకరకాల మాంసాహార వంటకాలతో ఆఫర్లు ప్రకటించేవారు. వారంముందే కళ్లు చెదిరే ప్యాకేజీలతో టిక్కెట్లు కొనుగోలుకు కౌంటర్లు తెరిచేవి. కానీ ఈ ఏడాదీ కూడా అవన్నీ ఎక్కడా జాడలేకుండా పోయాయి. కొత్త సంవత్సరానికి మరో వారం రోజులే ఉన్నా తాజా ఒమిక్రాన్ హెచ్చరికలతో ఎక్కడా వేడుకల ఆనవాళ్లే కనిపించడం లేదు. వాస్తవానికి గతేడాది మార్చిలో కొవిడ్ తొలి వేవ్ దేశంలో తీవ్ర ప్రభావం చూపడంతో లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. డిసెంబరులో కేసుల తీవ్రత కొంత తగ్గినా సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉండడం, లాక్‌డౌన్ కారణంగా ఆతిథ్య రంగం కకావికలం అవ డంతో న్యూఇయర్ వేడుకలు జరగలేదు. అయితే ఈ ఏడాదిలో సెకండ్‌వేవ్ తీవ్రత జూన్ తర్వాత ముగియగా కొన్ని నెలలుగా కేసుల సంఖ్యకూడా భారీగా తగ్గిపోయింది. ఫలితంగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. దీంతో ఈసారి భారీగా న్యూఇయర్ వేడుకలకు అన్ని హోటళ్లు భారీగా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కానీ ఒమిక్రాన్ ముప్పు అనూహ్యంగా దూసుకుని వచ్చింది. చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగయ సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోట్లరూపాయాలను వెచ్చించి ఈవెంట్లు నిర్వహిస్తే కేసుల ముప్పు, జనం రాకపోతే నష్టపోతామ నే ఆందోళనతో వరుసగా రెండో ఏడాదిలోను ఈవెంట్లు రద్దుచేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిరది. అటు న్యూఇయర్ వేడుకలకు రెస్టారెంట్లు సైతం బిర్యానీ ఆఫర్ల కింద ఒకటి కొంటే మరో ప్యాకెట్ ఫ్రీ.. అన్ లిమిటెడ్ బఫే ఆఫర్లు ప్రకటించేవి. తాజాగా ఒమైక్రాన్ ముప్పు భయం తో ఇవి కూడా ఫుడ్ ప్యాకేజీల జోలికి వెళ్లలేదు. ఈ రకంగా మళ్లీ వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిరది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు మరోమారు పెద్దగా నష్టపోనున్నారు. ఇలాంటి వారికి మళ్లీ ప్రభుత్వాలు అండగా నిలవాల్సి ఉంది.