పండగ ప్రయాణికులకు తప్పని తిప్పలు
కరీంనగర్,అక్టోబర్26(జనంసాక్షి): దసర పండగ సందర్భంగా కొద్దోగొప్పో మంది జిల్లాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారోనా కారణంగా బస్సులు బంద్ ఉండటంతో ప్రజలు ఇక్కట్లు
పడ్డారు. తగినన్ని సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందుల పడ్డారు. దీనికితోడు రైలు సర్వీసులు పూర్తి స్థాయిలో పునరుద్దరణకు నోచుకోలేదు. దూరప్రాంతాలకు వెళ్లే వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. సికింద్రాబాద్, హన్మకొండ, గోదావరిఖని, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ తదిరత ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు సొంత వాహనాలను ఆశ్రయించారు. కరోనా కారణంగా 90 శాతం మంది ప్రయాణికులు ఇప్పటికే స్వగ్రామాలకు చేరుకోవడంతో ప్రయాణికుల రద్దీకూడా అంతగా కనిపించలేదు. ఆర్టీసీ యాజమాన్యం బస్సులు ఏర్పాటు చేసినా ప్రయాణికులు అనుకున్నంత రాక బస్టాండ్ వెలవెలబోయింది.