పండిత్ దీన్ దయల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
ఖానాపూర్ రూరల్ 25 సెప్టెంబర్ (జనం సాక్షి): జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతకర్త. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల చంద్రభాన్’ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు. ఆ మహనీయుని జన్మదిన సందర్భంగా ఆదివారం స్థానిక అసెంబ్లీ బీజేపీ కార్యాలయంలో ని ఆవరణలో మొక్కలు నాటి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని.దేశం కొసం జీవించిన మహోన్నత వ్యక్తి గా అభివర్ణించారు. అలాగే బిజె వై ఎమ్ ఆధ్వర్యంలో ఖానాపూర్ బిజె వై ఎమ్ జెండా వద్ద పండిత్ దీన్ దయల్ చిత్ర పటానికి పుల మాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజె వై ఎమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల ఉపేందర్,జిల్లా ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రవణ్,పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్,మండల ఉపాధ్యక్షుడు ఎనగందుల రవి,బీజేపీ నాయకులు భూమన్న,రమేష్,మదిరె శ్రీనివాస్,రాజేశ్వర్,గోపి,రవీందర్,ప్రవీణ్ పాల్గొన్నారు.