పండుగ సెలవులలో దొంగతనాల నివారణకు పోలీసుల సూచనలు
దోమ SI విశ్వజన్
దోమ సెప్టెంబర్ 29(జనం సాక్షి)
•ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోండి. లేదంటే మీ వెంట తీసుకెళ్లండి
•సెలవులలో బయటకు వెలుతున్నప్పుడు సెక్యూరిటి అలారం, మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
•మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళము అమర్చుకోవడం మంచిది.
•తాళము వేసి ఊరికి వెళ్లవల్సి వస్తే మీ దగ్గరలోని స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారము ఇవ్వండి.
•మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.
•మీ వాహనాలను మీ ఇంటి ఆవరణ లోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. మీకు వీలైతే చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిది.
•నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటి గార్డులుగా నియమించుకోవాలి.
•మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
•మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. *వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడుతారు.*

కావున పైన తెలిపిన సూచనలు పాటించాలని దోమ SI విశ్వజన్ తెలిపారు.