పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

సంగారెడ్డి,మార్చి9 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక గాంధీ సెంటినరీ పాఠశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలను శిక్షణలో చెబుతారన్నారు. వాటిని ఆచరించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ వరలక్ష్మి, ఉప విద్యాధికారి, శ్యాం ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.