పక్షంలోగా అన్ని శాఖల సమాధానాలు ఇవ్వాలి
హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలు, శూన్యగంటకు సంబంధించి పక్షం రోజుల్లోగా అన్ని శాఖలు సమాధానాలు ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని శాసనభాపతి. నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూతో శాసనసభ ప్రాంగణంలో సభాపతి ఈ రోజు సమావేశమయ్యారు. ఇప్పటికి 110 ప్రశ్నలకు, మరో 315 శూన్యగంట అంశాలకు వివిధ శాకలనుంచి సమాధానాలు రావాల్సి ఉందని పదిహేను రోజుల్లోగా అవి అందేలా చూడాలని సభాపతి తెలిపారు. ఇక మీదట సమాధానాలు సకాలంలో రాని పక్షంలో సభాధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని మనోహర్ అభిప్రాయ పడ్డారు. పేపర్ వినియోగం తగించడంలో భాగంగా సభకు ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా సీడీల రూపంలోనే ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వెబ్ సైట్‌లో పొందుపర్చిన కార్యక్రమాల సమాచారాన్ని వారం రోజులకోమారు ఆప్‌డేట్ చేసేలా చూడాలని స్పీకర్ ఆదేశించారు.