పగలు వడ్డీవ్యాపారం.. రాత్రిపూట దోంగతనాలు

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ అంతర్‌ జిల్లా నేరస్ధుణ్ని పేట్‌ బషిరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసీ అతని వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే సోత్తు స్వాదీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు పంపారు. సిఐ జానయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లికి చెందిన బైరి శ్రీనివాస్‌(47) నగర శివారు ప్రాంతం మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఇతను స్ధానింగా వడ్డీవ్యాపారం నిర్వహంచేవాడు. ఆదిలాబాద్‌, శ్రీరాంపూర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పలు దోంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. దీంతో తన మకాంను ఉప్పల్‌ సమీపంలోని మేడిపల్లికి మార్చాడు. అక్కడే సానికంగా వడ్డీ వ్యాపారం నిర్వహించి నమ్మంగా మెలిగాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లి గుర్తించి.. దోంగతనాలకు పాల్పడేవాడు. నగరంలొని హయత్‌నగర్‌, కుషాయిగూగడ, ఘట్‌ కేసర్‌, రాజేంద్రనగర్‌, వనస్ధలిపురం, నార్సింగి, పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పలు దోంగతనాలకు పాల్పడ్డాడు. ఇతడు ఆదివారం కోంపల్లిలో ఆనుమానాస్పదంగా తిరుగుతూ బంగారం ఆమేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసిం. దీంతో ఆతని వద్ద నుంచి 61 తులాల విలువైన బంగారు ఆభరణలు , 3కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు స్వాదీనం చేసుకోని రిమాండ్‌కు పంపారు.