పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్న వరి గడ్డి వినాయకుడు.

మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు.
తాండూరు సెప్టెంబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శ్రీ కాళికాదేవిఆలయ ప్రాంగణంలో వినాయక చవితి పురస్కరించు కొని మైక్రో స్టాఫ్ ఇంజనీర్ మధు వరి గడ్డితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు.
పది పిట్ల ఎత్తు మూడు వరిగడ్డి మొపులతో నాలుగు రోజుల్లో తయారు ప్రతిష్టాపిచారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వరి గడ్డి వినాయకుడిని తయారు చేసినట్లు మధు జనంసాక్షి ప్రతినిధితోతెలిపారు .వరిగడ్డితో తయారుచేసిన వినాయక ప్రతిమను ప్రతిష్టాపించి అందరిని ఆకట్టుకున్నా రు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మధు వరిగడ్డితో శ్రీ వరసిద్ధి వినాయకుడి ప్రతిమను తయారుచేసి తనదైన శైలిలో పట్టణ ప్రజలను భక్తులను ఆకర్షింపజేశారు.ఈ వినాయకుని దర్శించుకు నేందుకు పట్టణ భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.