పట్టాలపై కూలిన చెట్లు.. పలు రైళ్ల నిలిపివేత
ఆదిలాబాద్: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు రెబ్బెన మండలం రాళ్ల పేట రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై చెట్లు కూలిపడ్డాయి. దీంతో కాగజ్‌నగర్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను, సిర్పూర్ టీలో ప్యాసింజర్ రైలును నిలిపి వేశారు. రైల్వే సిబ్బంది పట్టాలపై చెట్లను తొలగిస్తున్నారు.