పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

 

 

 

 

– తప్పిన పెను ప్రమాదం

కడప, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా రైల్వేకోడూరు సవిూపంలో రైలు పట్టాలు తప్పింది.. వెంటనే గమనించిన లోకో పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో ముప్పు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.. దీంతో రైల్వేశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలంలో మరమ్మతులు చేస్తున్నారు. అలాగే రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా తిరుపతిలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఏర్పేడు రైల్వే స్టేషన్‌ సవిూపంలో ప్యాంట్రీ కార్‌ చక్రం విరగడంతో ప్రమాదం జరిగింది. రైలు లోకో పైలట్‌ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. మళ్లీ ఇప్పుడు షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడం కలకలంరేపింది.