పట్టిసీమపై కేసీఆర్ మౌనమేలనో!: పాల్వాయి

99as25a3హైదరాబాద్, మార్చి 31: తెలంగాణకు నీటి కేటాయింపులు లేకుండా పట్టిసీమ నిర్మిస్తుంటే  సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు నష్టమని  పాల్వాయి అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని  ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి విమర్శించారు. పట్టిసీమపై చర్చించేందుకు అఖిలపక్ష కమిటీ వేయాలని, గోదావరిపై ఏడు ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.