*పట్టుబడిన వాహనం వేలం*
*పలిమెల, అక్టోబర్ 11 (జనంసాక్షి)* పలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన మహింద్రా ఆటో వాహనం వేలం వేయబడుతుందని ఎస్సై అరుణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్చైజ్ శాఖ వరంగల్ డిప్యూటి కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రోహిబిషన్ & ఎక్చైజ్ సూపరిండెంట్ మరియు పలిమెల ఎస్సై ఆధ్వర్యంలో నేడు పలిమెల పోలీస్ స్టేషన్ నందు వేలం నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు పలిమెల పోలీస్ స్టేషన్ నందు జరిగే వేలంపాటలో పాల్గొనాలని ఎస్సై అరుణ్ తెలిపారు.