పట్టువీడని విపక్షాలు

4

– 27కు ఉభయసభల వాయిదా

న్యూఢిల్లీ,జులై 24(జనంసాక్షి):

పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. గురువారం కూడా తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి.  వ్యాపం, లలిత్‌ మోదీ వ్యవహారంపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలు నాలుగోరోజూ  కొనసాగాయి. సభ్యుల గందరగోళం మధ్య ఉభయసభలూ ఈ నెల 27కు  వాయిదా పడ్డాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షం సిద్ధంగా లేదని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. పార్లమెంట్‌ సజావుగా సాగడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని రాజ్‌నాథ్‌ చెప్పారు. దీంతో నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చ జరగకుండానే లోక్‌సభ వాయిదా పడింది. సభప్రారంభంలోనే విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఐపీఎల్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌, హైకోర్టు విభజన అంశంపై తెరాస, వ్యాపం కుంభకోణం, ఇతర అంశాలపై వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షసభ్యుల నినాదాలతో సభ ¬రెత్తింది. స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టినా సభ్యులు శాంతించలేదు. సభ్యులకు చర్చించే ఇష్టం లేనట్లుందని స్పీకర్‌ వ్యాఖ్యానించారు.  దీంతో సభను ఈనెల 27కు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ప్రకటించారు. రాజ్యసభలోనూ ఇదే పరస్థితి ఏర్పడింది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ ప్రకటించారు. ఇదిలావుంటే పార్లమెంట్‌ సమావేశాలను కాంగ్రెస్‌ అడ్డుకోవడంపై బిజెపి సభ్యులు మండిపడ్డారు. కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా శుక్రవారం ఉదయం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న ఉత్తరాఖండ్‌, కేరళ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులను తొలగించాలని భాజపా ఎంపీలు డిమాండ్‌ చేశారు. ప్లపకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు హైకోర్టు విభజనపై తెరాస ఎంపీ జితేందర్‌రెడ్డి ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించారు. అనంతరం సభ ఈనెల 27కు వాయిదా పడింది. హైకోర్టు విభజన చేపట్టాలని కోరుతూ తెరాస ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళనకు దిగారు. హైకోర్టును విభజించాలని నినాదాలు చేశారు.