పడిపోతున్న సిఎం జగన్‌ గ్రాఫ్‌

ఏడాదిన్నరలో ఇప్పటికీ ఎంతో తేడా
ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఇండియాటుడే సర్వే
న్యూఢల్లీి,ఆగస్టు17(జనంసాక్షి): ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభ మసకబారుతోంది. ’ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ’మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో జగన్‌ గురించి ప్రజలు వెల్లడిరచిన అభిప్రాయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఇప్పుడు ఆయనపై
పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. ఏకంగా 81 శాతం మంది ఆయన పాలనపై అసంతృప్తిగా ఉన్నట్టు సర్వే వెల్లడిరచింది. ముఖ్యమంత్రుల విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ అందరికంటే ముందున్నారు. ఆయన పాలన అద్భుతంగా ఉందంటూ 42 శాతం మంది సొంతరాష్ట్ర ప్రజలు అభిప్రాయపడ్డారు. స్టాలిన్‌ తర్వాతి స్థానంలో 38 శాతంతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, 35 శాతంతో కేరళ సీఎం పినరయి విజయన్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (30), అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (29), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (29), రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ (22), ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ (22), రaార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (19), చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ 19 శాతంతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ 11 మంది ముఖ్యమంత్రులలో ఏపీ సీఎం జగన్‌ పేరు ఎక్కడా కనిపించకపోడం గమనార్హం. ఇక, దేశంలోనే బెస్ట్‌ సీఎం ఎవరన్న దాంట్లో కూడా జగన్‌ బాగా వెనకబడిపోయారు. గతేడాదితో పోలిస్తే సగం మంది మాత్రమే జగన్‌కు ఓటేశారు. గతేడాది దేశంలోనే అత్యుత్తమ సీఎంగా పేరుకెక్కిన జగన్‌ రేటింగ్స్‌ ఈసారి దారుణంగా పడిపోవడం సొంత పార్టీ శ్రేణులనే విస్మయపరుస్తోంది. తాజా ఫలితాలతో జగన్‌ పాలనపై ఎవరూ సంతృప్తిగా లేరన్న విషయం అర్థమవుతోంది. సొంత ఓటర్లను కూడా ఆయన పాలన మెప్పించలేకపోతోందన్న విషయాన్ని ఈ సర్వే తేల్చేసింది.మరోవైపు, ప్రధాని మోదీ రేటింగ్స్‌ కూడా పడిపోయాయి. అయితే, ఏళ్ల తరబడి ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, నవీన్‌ పట్నాయక్‌ వంటి వారి ప్రభ ఇప్పటికీ వెలుగొందుతుండగా, రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టిన జగన్‌ రేటింగ్‌ క్రమంగా పడిపోతుండడం గమనార్హం.

తాజావార్తలు