పత్తిధర తగ్గింపునకు నిరసిన్తూ రోడ్డెక్కిన రైతులు
గంగాధర, జనంసాక్షి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు రూ. 1000 తగ్గింపునకు నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. క్వింటాలు పత్తి రూ. 4,300 ఉంటే రూ. 3వేలకే వ్యాపారాలు ధర నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ మార్కెట్ నుంచి కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర చౌరస్తాలోని పెద్దఎత్తున గంటసేపు ధర్నా చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా ఎక్కడిక్కడే వాహనాలను నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పినా శాంతించలేదు. చివరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అంటనీ ప్రసాద్ వచ్చి పత్తికి మద్దతు ధర అందిస్తామని నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు.