పత్తి పంటలో గులాబీ రంగు రంగుల పురుగు.

నెరడిగొండ ఆగస్టు22(జనంసాక్షి):
మండలంలోని కుప్టి కే గ్రామంలో ప్రత్తి సోయా పంటలను సోమవారం రోజున బోథ్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి. శ్రీధర్ స్వామి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్తి పంటలో అక్కడక్కడ గులాబీ రంగు పురుగు సోకడం జరిగిందని,చీడపీడల పురుగుల నివారణకు మందు ప్రోఫెనోపాస్,వేప నూనె కలిపి పిచికారి చేయాలన్నారు.రసం పీల్చే పురుగు నివారణకు మోనో క్రోటో పాస్,ఇమిడక్లో ప్రిడ్ పిచికారి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఎఈఓ సాయి కీర్తన రైతులు ఉన్నారు.

తాజావార్తలు