పత్తి రైతులకు అండగా సిసిఐ కేంద్రం
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత
యాదాద్రి భువనగిరి,నవంబర్11( జనం సాక్షి ): రైతులకు మద్దతు ధర ఇచ్చి దళారులను నిరోధించేందుకే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పఅన్నారు. ఆలేరులో బుధవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే పత్తిని అమ్ముకోవాలన్నారు. అలా అయితేనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది, నష్టం జరుగకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే తప్పక మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.