పత్తి రైతులకు గుర్తింపు కార్డులు

మెదక్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇప్పటికే గ్రామాల్లో పత్తిరైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలని వ్యవసాయాధికారులు అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగంపత్తి రైతులకు లబ్ధి చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందజేస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ తొలిగించేందుకు సీసీఐ కేంద్రాల్లో ఈ కార్డును చూపించి రైతులు పత్తిని విక్రయించుకోవచ్చని తెలిపారు. దీంతో ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర నేరుగా రైతులకు అందుతుందన్నారు. గ్రామాల్లో పత్తిని సాగు చేసిన రైతులను ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే ద్వారా గుర్తించడం జరిగిందన్నారు. వారందరికీ పూర్తిస్థాయిలో కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టిందని అన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న గుర్తింపు కార్డులను రైతులు వినియోగించుకోవాలని కోరారు. కార్డులను తీసుకుని మార్కెట్‌లో పత్తి పంటకు మద్దతు ధరను పొందవచ్చని సూచించారు.