పత్రికలకు రాజా  కీయాలేల !

పొద్దును బట్టి పువ్వు  తిరుగుతుంది
ప్రకృతికి చూసి  కలం పదునెక్కుతుంది
పండు వెన్నెలకు  కలువ పొంగి పూస్తుంది
కుళ్ళు రాజా  కీయాలకు చర్నా కోలా  ఝళిపిస్తుంది .నిజం దాగదని వార్త ఆగదని ఘంటాపథంగా చెబుతుంది.
ప్రభుత్వ పరిపాలన కు అద్దం పడుతుంది
అవినీతి అన్యాయాన్ని ఉతికి ఆరేస్తుంది
ప్రజా ధనం  వృధా చేసే పాలకులను నగరం నడి బొడ్డున శిలువ వేసి  తప్పు  చేస్తే శిక్ష తప్పదని  గుణపాఠం చెబుతుంది
కవి కలం రవి బలం  ప్రజా పక్షం  నిష్పక్షపాతం
కూసే కోడికి  పాడే కోకిల కు  జాలువారే సాహిత్యానికి  రాజా కీయాలు  మరీ దూరం పత్రికలు ప్రజాస్వామ్య పుత్రికలు సుప్రీం కోర్టు తుది తీర్పులు
సమాజములో కుళ్ళును దులిపి దారి చూపే దిక్సూచీలు
అవినీతి నాయకులను  వంత పాడుతే     అన్యాయాలకు  గొడుగు పడుతే  పత్రికలకు
ఆక్సీజన్ అందకుండా పోతుంది
జాగ్రత్త సుమీ  !  బాహు పరాక్

“పూసాల సత్యనారాయణ
హైదరాబాద్
9000792400