పదిరోజుల్లో ఉద్యోగులపై బనాయించిన

కేసులు ఎత్తేయండి

లేకుంటే మహాఉద్యమానికైనా సిద్ధం

ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌  దేవీప్రసాద్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి): సెప్టెంబర్‌ మార్చ్‌ సాగరహారం సందర్భంగా తమపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందించారు. తెలంగాణ కవాతు శాంతి యుతంగా జరిగేందుకు ఉద్యోగులు వాలంటీర్లుగా పని చేస్తే సుప్రీం ఆదేశాలననుసరించి తమపై కేసుఎత్తి నమోదు చేశారని ఆరోపించారు.  పోలీసులే భాష్పవాయువుతో చెడగోట్టే ప్రయత్నం చేశారని అన్నారు. పోలీసులు దాడిలో గాయపడిన ఉద్యోగులందరికీ ప్రభుత్వం మెరుగైన వైద్య సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో విచారణ జరిపి కేసులు ఎత్తిమవేయాలని లేకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు.వీరి డిమాండ్లకు సీఎన్‌ సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.