పదిరోజుల్లో మంచిర్యాలకు గోదావరి నీరు
గరిమిళ్ల: మంచిర్యాల పట్టణానికి తాగునీటికోసం రూ.48 లక్షల మారుమూల గ్రామాల అభివృద్ధి నిధులతో ముల్కల్లా దగ్గర గోదావరి నదిలో జరుగుతున్న పనులను మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి పరిశీలించారు. మరో పదిరోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయని దీంతో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తీరనుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.