పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీల ప్రకటన
హైదరాబాద్,నవంబర్23: పదోతరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను మంత్రి పార్థసారథి ప్రకటించారు. మార్చి 6నుంచి 23వతేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6నుంచి ఇంటర్ ప్రథమ, 7 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్9 వరకు పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 6 నుంచి 25 వరకు ఇంటర్ ప్రయోగ పరీక్షలుంటాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం మంత్రి విడుదల చేశారు. జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. గతంలో నిర్ణయించిన మేరకు పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఇందులో ఎలాంటి మార్పులేదన్నారు. అలాగే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. డిసెంబరు 7లోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు