పదోతరగతి పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 12 మంది విద్యార్థులు డిబారు

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదోతరగతి పరీక్షల్లో ఈ రోజు చూచిరాతకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. మరో ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించారు. జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌, ఉపవిద్యాధికారి రామారావు, ఇతర తనిఖీ బృందాలు జిల్లావ్యాప్తంగా 65 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.