పదోతరతి పరీక్షలో 32 మంది డిబార్
ఆదిలాబాద్ విద్యావిభాగం: పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు పాల్పడుతున్న 32 మంది విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పరిశీలకులను బాధ్యతల నుంచి తప్పించారు. జిల్లా విద్యాధికారి అక్రమల్లాఖాన్, ఉపవిద్యాధికారి రామారావు, ఇతర తనిఖీ అధికారులు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా పరీక్ష కేంద్రాలను పరిశీలించి చూచిరాతకు పాల్పడుతున్న విద్యార్థులపై మాల్‌ప్రాక్టీన్ కేసును నమోదు చేశారు. వాంకిడిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఒకరు. ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10 మంది జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో నలుగురు, కాగజ్‌నగర్ జిల్లా పరిషత్తు బాలుర పాఠశాలలో ఒకరు, ఆదిలాబాద్‌లో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఒకరు. విద్యార్థి ఉన్నత పాఠశాలలో మరొకరు, జిల్లా పరిషత్తు భీమారంలో ఒకరు. ఆర్‌డీ హెచ్‌వీలో ఒకరు. కృష్ణంపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు, నార్నూర్‌లో ఒకరు, సిర్పూర్ (టి) సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఐదుగురు, లోకేశ్వరం జిల్లా ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు.