పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

జ‌నం సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. తొలుత ఏయూలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి   చేసారు.