పద్దన్నపాలెం చెరువుకట్టకు గండి ఇబ్బందుల్లో వాహన చోదకులు

దొనకొండ, జూలై 18 : మండలంలోని పెద్దన్నపాలెం చెరువుకట్టకు మంగళవారం రాత్రి గండిపడటంతో చెరువుకట్టపై దొనకొండ – పొదిలి ప్రధాన రహదారి ఉండటం వలన వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంకు చెరువునిండా నీళ్లు చేరాయి. చెరువుకట్ట క్రింది భాగంగా పెద్ద రంద్రం ఏర్పడి దాని ద్వారా నీటి ప్రవాహం పెరిగి కట్ట క్రిందభాగం పెద్ద గండిపడి చెరువులోని నీరు మొత్తం వాగులపాలయ్యాయి. చెరువుకట్టపై ప్రయాణం ప్రమాదం అని తలచి అధికారులు వాహనాలను నిలిపివేసి తాత్కాలికంగా సమీపంలోని పెద్దన్నపాలెం వాగులో నుంచి చిన్నగుడిపాడు మీదుగా దొనకొండకు తరలించారు. వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులకు వరుణుడు కరుణించి వర్షం కురిపిస్తే చెరువుకు చేరిన నీళ్లన్నీ ఒక్క రాత్రికే వృధాగా పోయాయని రైతులు అందోళన చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చెరువుకట్టపై రహదారి సరిగా లేక వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగేవి. ఎన్నో పర్యాయాలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుకట్టకు కట్టపై ఉన్న రహదారికి శాశ్విత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గండిపడిన చెరువుకట్టకు బుధవారం ఉదయం ఆర్‌అండ్‌బి అధికారుల పరిశీలించారు.