పద్మశాలి యుద్ధభేరి బహిరంగ సభను విజయవంతం చేయండి. ఆహ్వాన సంఘం సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్.
యుద్ధభేరి పోస్టర్ల ఆవిష్కరణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 3, (జనంసాక్షి). పద్మశాలీల హక్కుల సాధన కోసం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగే పద్మశాలి యుద్ధభేరి సభను విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వాన సంఘం సభ్యులు లగిశెట్టి శ్రీనివాస్ కోరారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘం కార్యాలయంలో యుద్ధభేరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న జరిగే యుద్ధభేరి సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి పద్మశాలి కుల బాంధవులు కుటుంబాలతో సహా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన చూస్తే పదిమందికి శాసనసభ్యులుగా రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీల ఐక్యతను చాటిచెప్పేలా జరిగే బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గోలి వెంకటరమణ, గోనె ఎల్లప్ప, మోర రవి, కాముని వనిత, గుండ్లపల్లి పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.