పద్మశ్రీ వాపస్‌

3

– మతహింస భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసన

– పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా

న్యూఢిల్లీ అక్టోబర్‌13(జనంసాక్షి):

దేశంలో జరుగుతున్న మతహింస, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి నిరసనగా తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రముఖ పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా మంగళవారం ప్రకటించారు. ‘ఇది నాకు లభించిన అత్యున్నత పురస్కారం. దీనిని వెనక్కి ఇవ్వడం ద్వారా దేశంలో పెరుగుతున్న మతపరమైన దాడులపై నిరసన తెలియజేస్తున్నాను. ఇదే తరహాలో దాడులు కొనసాగితే దేశం నాశనమైపోతుంది. మనం 21వ శతాబ్దంలో నివసిస్తున్నాం. మనం ఆలోచించి ముందుకు సాగాల్సిన సమయమిది’ అని ఆమె పేర్కొన్నారు.

దేశంలో అసహనం వాతావరణం పెరిగిపోతున్నదంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు రచయితలు తమకు లభించిన పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రచయిత ఎంఎం కల్బుర్గి, హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద్‌ పన్సారే హత్యలకు నిరసనగా కన్నడ రచయిత, ప్రొఫెసర్‌ రహమత్‌ తారికేరి కూడా తనకు ప్రదానం చేసిన పురస్కారాన్ని వెనుకకు ఇస్తున్నట్టు  ప్రకటించార