పన్నూర్ లో పర్యటించిన కేంద్ర బృందం
జనంసాక్షి , రామగిరి : స్వచ్ఛ సర్వెక్షన్ గ్రామీణ -2023 లో భాగంగా రామగిరి మండలం లోని పన్నూర్ గ్రామపంచాయతీ లో కేంద్ర బృందం పర్యటించారు.సెగ్రిగేషన్ షేడ్,పబ్లిక్ టాయిలెట్స్,ఎస్ బి ఎం, ఇన్స్టిట్యూషన్స్, వాల్ పైంటింగ్స్ ఇతర శానిటేషన్ పనులు పై సర్వే నిర్వహించారు.నూతన గ్రామపంచాయతీ గా ఏర్పడి అనతి కాలంలోనే అభివృద్ధి పనులలో , స్వచ్ఛతలో ముందంజలో ఉందనీ కేంద్ర బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశీలకులు నవీన్, డి ఆర్ డి ఎ శ్రీధర్, డి ఎల్ పి ఓ రాంబాబు, ఎంపిడిఓ రమేష్, ఎంపీఓ భాస్కర్, స్థానిక సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి, కార్యదర్శి ఆకాష్, వార్డు సభ్యులు గంధం అర్చన, తన్నీరు ప్రదీప్, కో ఆప్షన్ మెంబర్ గంధం మాధవి, స్పెషల్ ఆఫీసర్ స్వరూప రాణీ, సీసీ బాపు, శంకర్, లక్ష్మి, వనిత, సీ ఏ గాజుల వనిత, అంగాన్వడి టీచర్ చేతి రాజ్యలక్ష్మి, ఆశా వర్కర్లు శిరీష, కారోబార్ పెరుమాండ్ల అభి, బైరి శంకర్, చింద్ధం శంకర్, ఇజ్జగిరి సారయ్య, మొతుకురి సాయి కుమార్, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.