పరకాలలో ఎవరు నిలబడ్డా గల్లంతు కావాల్సిందే
కొండా దంపతులది అత్యాశ కాక మరోటి కాదు
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్,అక్టోబర్9(జనంసాక్షి): పరకాల నియోజకవర్గంలో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని పరకాల తాజా మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొండా సురేఖ వచ్చినా, ఎవరు వచ్చిన ఆఓటమి తప్పదని అన్నారు. తాను గెలవడమే కష్టంగా ఉంటే ఏడెనిమిది సీట్లు గెలిపిస్తానని కొండా దందపతులు చెప్పడాన్ని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ హవా నడుస్తోందన్నారు. మంగళవారం హన్మకొండలోని ఆయన నివాసంలో ఆత్మకూరు మండలం మల్కపేట గ్రామం నుండి పలువురు కాంగ్రెస్ నాయకులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాలలో టీఆర్‌ఎస్ ను ఓడించి సత్తా ఏపార్టీకి లేదన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా పరకాలలో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే ఈ రోజు ఇతర పార్టీల నుండి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. పార్టీని నమ్ముకున్నవారికి అన్నివిధాలుగా అండగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు యాట భాస్కర్, మాజీ వార్డుమెంబెర్ బండి రమేష్, నాయకులు యాట సంపత్, బస్స ఐలయ్య, అంకతి సాంబయ్య, బొజ్జ కుమారస్వామి, బస్స నరేష్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎనకతాళ్ల రవీందర్, కాంతాల కేశవరెడ్డి, అంకతి రవి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న చేరికలు
టీఆర్‌ఎస్ లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో సప్పిడే సంజీవ్, తుమ్మిడే సురేష్ సహా 100మంది యువకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి టిఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప తన నివాసంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి (పరిగి) మహేశ్వర్ రెడ్డి సమక్షంలో గండీడ్ మండలం పెద్దవార్వాలుకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కొలుకొండ గ్రామం గౌడ సంఘానికి చెందిన 23 కుటుంబాలు టీఆర్‌ఎస్ లో చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు గౌడ సంఘం సభ్యులు కన్నవిర సోమయ్య, కన్న యాదగిరి, కన్న రవి, భాషంపల్లి ఎల్లయ్య , జడలా యాకస్వామి, మాధపురం రమేష్ , బైరు సత్తయ్య , మెదరింటి పర్శరములు, పి.మల్లయ్య , కె.సత్తయ్య, పి. రాములు తదితరులకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.