పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి

పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే ఎన్నికలు జరుగుతోంది.  తెలంగాణ ఉద్యమంఊపందుకున్న వేళ జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో అందరి దృష్టి పరకాల స్థానంపైనే ఉంది. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కాంగ్రెరాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఒక పార్లమెంట్‌, 18 అసెంబ్లీ స్థానాలకు ఇవాళే పోలింగ్‌.ఇక తెలంగాణ విషయానికొస్తే ఒక్కస్‌, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ ప్రచారం సాగింది. ఈ స్థానంలో గెలవడం ద్వారా తెలంగాణవాదం బలహీనపడిందని, తెలంగాణప్రజలు కూడా సమైక్యవాదానికే మొగ్గుచూపారనే వాదనను తీసుకువచ్చేందుకు సమైక్యవాద పార్టీలు గుంటనక్కల్లా కాచుకు కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణవాదులు, పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి.తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. తెలంగాణవాదాన్ని బతికించుకోవాలి. అత్యంత జాగకతతో వ్యవహరిస్తూ సరైన నిర్ణయం తీసుకునే ఈ సమయాన పరకాల ఓటర్లు ఏకం కావాలి. వ్యక్తులుగా మన మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టితెలంగాణ బిడ్డను గెలిపించుకోవాలి. మనమధ్య చీలిక వస్తే సమైక్యవాద జగన్‌ పార్టీ  గెలిచే ప్రమాదం ఉంది. అదే జరిగితే సమైక్యవాదులు లాభపడతారు. తెలంగాణ ప్రజలు నష్టపోతారు. అంతేకాకుండా ఇప్పటి వరకూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న మన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఇదికొంత ఆటంకమూ అవుతుంది. సమైక్య వాదాన్ని ఓడించడం ద్వారా పరకాల ఓటర్లు తెలంగాణ చైతన్య స్ఫూర్తి చాటాలి. ఉద్యమం ముసుగులో మతతత్వాన్ని చొప్పించేందుకు ప్రయత్నించే పార్టీ పట్ల మరింత జాగ్రత్తవహించాల్సిన అవసరం ఉంది.మతం పేరిట ఓట్లు దండుకునే పార్టీని దూరంగా ఉంచాలి. అంతేకాకుండా మతతత్వం బలపడకుండా చూసుకోవాలి. సమైక్యవాద పార్టీల ప్రలోభాలకు ఏ మాత్రం లోనుకాకుండా తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాజకీయ జేఏసీ మద్దతిచ్చిన పార్టీనే గెలిపించాలి. పరకాల ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి తెలంగాణ కోసం పాటుపడే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని జనంసాక్షి ఆశిస్తోంది.