పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి
భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) :
పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్ యూత్ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర రాజేశ్ అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించని పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని ఆగ్రహించారు. పరకాలలో టీిఆర్‌ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలంగాణ సత్తా చాటాలని అన్నారు. కేవలం జాతీయ పార్టీల వల్లే తెలంగాణ వస్తుందనడంలో వాస్తవం లేదని, గెలిచిన తర్వాత తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాన్చివేత దోరణిని అవలంబిస్తుందన్నారు. కాగా ఇప్పటీి వరకు ప్రకటించలేకపోగా వారి నాయకుల మాటల మూలంగా ఎంతో మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమయ్యారని అందుకే పరకాల ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. నాడు మూడు రాష్ట్రాలు ఇచ్చిన బీజేపీ సైతం ఇప్పుడు తెలంగాణ పల్లకిని మోస్తున్నట్లు చెప్పారు. ఎందుకు తెలంగాణ అప్పుడు ఇవ్వలేదని వారు సూటిగా ప్రశ్నించారు. స్వప్రయోజనాలే ద్యేయంగా అన్ని పార్టీలు ముందుకు పోతున్నాయని ఒక్క టీిఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యేక తెలంగాణ కోసం దశాబ్దకాలంగా ఉద్యమిస్తుందని చెప్పారు. పరకాల గెలుపు తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగుగా ప్రజలు గుర్తించి భిక్షపతిని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇందు కోసం భూపాలపల్లి టిఆర్‌ఎస్ యూత్ ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తామని అన్నారు. పరకాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బారి మెజార్టీతో గెలిస్తే కేంద్రప్రభుత్వం తప్పక దిగి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కప్పల రాజేశ్, కప్పల శ్యాం, లింగాల నరేష్, క్రాంతి, సురేష,్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.