పరాజయం నుండి పాఠాలు నేర్చుకో..!!
ఓ మనిషీ ! నీవు
అవివేకంతో
అజ్ఞానంతో
అహంకారంతో
అంధకారంలో
అయోమయంలో
అమాయకత్వంలో
అటూ ఇటూ కాని సిగ్గూ లజ్జా
“రోషం పౌరుషంలేని జీవితం” జీవించకు…
ఓ మనిషీ ! నీవు
క్రిందపడిన ప్రతిసారి
నీవు పైకిలేచి నిలబడు…
“గెలుపు” నీకే సిద్ధిస్తుంది…
“విజయలక్ష్మి” నిన్నే వరిస్తుంది…
నీలో “అనంతమైన శక్తి” వుందని
అదే నిన్ను నడిపిస్తుందని నమ్ము…
ముందుకే చూడు ముందుకే అడుగెయ్ “పరాజయం నుండి పాఠాలు” నేర్చుకో…
ఓ మనిషీ ! నీవు
ఉన్నదాంతో తృప్తిచెందక
“గాడిదలా” గడ్డి…తినీ తినీ
“జలగలా”…జనాన్నిపీడించి పీడించి
“అడ్డదారిలో కోట్లు”…ఆర్జించి ఆర్జించి
“కుబేరుడవై” పోయానని కులకకు…
“పూలపాన్పుపై” కునుకు తియ్యకు…
ఓ మనిషీ !
రేపటి ఉదయమే
“నీ కనురెప్పలు” తెరవపోతే…
“శుభసూర్యోదయం కాంచే
భాగ్యమే” నీకు కలగకపోతే…
కళ్ళు మూసి…
“కదలలేని కట్టెగా” మారిపోతే…
“మళ్ళీ మట్టిలో” నీవు కలిసిపోతే…
నీ “ఆత్మ పరమాత్మను” చేరిపోతే…
నీ “ఆస్తులన్నీ పరులకే” చెందునన్నది
“నమ్మలేని ఓ నగ్నసత్యమని” తెలుసుకో…
రచన:
“కవి రత్న”
“సహస్ర కవి”
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి…9110784502