పరిగి రమేష్ దర్గాలో ముక్కులు సమర్పించుకుంటున్న ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
మతసామరశ్యానికి ప్రతీక దర్గా ఉత్సవాలు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి
సయ్యద్ పల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
పరిగి రూరల్, సెప్టెంబర్ 29, ( జనం సాక్షి )
మత సామరశ్యానికి ప్రతీకగా సయ్యద్ పల్లి దర్గా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామంలోని హజ్రత్ ఖాజా సయ్యద్ ముఖ్దుమ్ హుస్సేని చిస్తి జిందవలి దర్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దర్గా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు, పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి బుధవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా టీఆర్ఆర్ మాట్లాడుతూ దర్గా ప్రతిష్టతను చాటుతూ ఉర్సు ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. దర్గాలో శుద్దమైన మనసు పెట్టి ప్రార్థనలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని అపార నమ్మకంతో పూజిస్తున్నారన్నారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ కరణం అరవింద్ రావ్, సయ్యద్ పల్లి సర్పంచ్ వెంకట్ రామ కృష్ణా రెడ్డి, నాయకులు వెంకటయ్య, బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు టీ.రాంమ్మోహన్ రెడ్డి వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పరశురాంరెడ్డి, నాయకులు కె.హన్మంతు ముదిరాజ్, అక్బర్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
29 పిఆర్ జి 06లో పరిగి సయ్యద్ పల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి
07లో దర్గాలో మొక్కులు సమర్పిస్తున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తదితరులు