పరిమళించిన మానవత్వం

2
– అనాధ శవానికి ముస్లిం మహిళ అంతిమసంస్కారం

వరంగల్‌,జులై 6(జనంసాక్షి):  ఓ ముస్లిం మహిళ హిందూ వృద్ధుడి మృతిపట్ల మానవత్వం చాటుకుంది. చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టేందుకు కుమారుడు నిరాకరించడంతో ముస్లిం మహిళే అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. హన్మకొండలోని ఓ వృద్ధాశ్రమంలో గత కొంత కాలం నుంచి ఒక వృద్ధుడు ఉంటున్నాడు. అనారోగ్యంతో వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. అయితే తండ్రికి తలకొరివి పెట్టేందుకు అతని కుమారుడు నిరాకరించాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకురాలైన ముస్లిం మహిళ ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంది. దీంతో ఆమెను అంతా అభినందించారు.