పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి
సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్ చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో భూములను కేటాయించిందో ఆ లక్ష్యం నెరవేరలేదని పేర్కోన్నారు. ఏపీఐఐసీ పరిశ్రమలకు కట్టబెట్టిన దాదాపు 200 ఎకరాలు భూములు నిరర్థకంగా పడి ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై పీఏసీ మెదక్ జిల్లాలో ఈ రోజు విచారణ జరిపింది. సంగారెడ్డి మండలం కొత్లాపూర్, పటాన్‌చెరువు, రామచంద్రపురంలలో ఏడు పరిశ్రమలకు కేటాయించిన భూములను పరిశీలించారు. ఉద్యోగాలు ఇస్తామని పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికే నెరవేర్చలేదని కమిటీ ముందు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. 15రోజుల్లో జిల్లాలో ఏపీఐఐసీ కేటాయించిన నిరర్థక భూములు వివరాలను తెలియజేయాలని కమిటీ కలెక్టర్‌ను ఆదేశించింది.