పరిష్కారం దిశగా అడుగులు : పొంగులేటి
కేంద్రమంత్రి ఆజాద్‌తో డిఎస్ భేటీ
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢల్లీి, జూన్ 14 (జనంసాక్షి) :
తెలంగాణపై అధిష్టానం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ తెలిపారు. శుక్రవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎదుట దిష్టిబొమ్మ దగ్ధం చేయడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై తుదినిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని అన్నారు.
ఆజాద్‌తో డిఎస్ భేటీ
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆజాద్‌తో మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలను, రాజకీయ అనిశ్చితి తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా అంతకుముందు ఆజాద్ యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో పదినిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితిపైవారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ప్రధాని మన్మోహన్ నివాసంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఆజాద్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితరులు హాజరైనట్టు తెలిసింది. ఆహార భద్రత బిల్లుపై, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైన, ఆంధ్రప్రదే శ్‌లో తాజా రాజకీయ పరిస్థితిపైన, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏర్పాటుపైన చర్చిస్తున్నట్టు తెలిసింది.