పరిసరాల పరిశుభ్రత పాటించాలి *జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్,

ఖానాపురం అక్టోబర్11జనం సాక్షి
 పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్అన్నారు. మంగళవారం మండలంలోని రాగంపేట గ్రామంలో వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాగం పేట్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్య శిబిరానికి హాజరైన జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే చేపట్టి జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని తెలిపారు. గ్రామ సర్పంచ్  బాషబోయిన ఐలయ్య  మాట్లాడుతూ ప్రస్తుతం గ్రమం లోని ప్రజలందరూ వైద్య సిబ్బంది ఇచ్చిన సలహా సూచనలు పాటిస్తూ, ఎవరైనా జ్వరంతో బాధపడితే  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని, ప్రతి శుక్రవారం  డ్రైడే పాటించాలని కోరారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు బృందాలుగా విడిపోయి ఇల్లు ఇల్లు తిరుగుతూ కీటక జనిత వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.
స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ  సిబ్బంది దోమల మందు పిచికారి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ మల్యాల అరుణ్ కుమార్, డాక్టర్ కల్పన, ఎస్ యుఓ బి నందా, హెల్త్ సూపర్వైజర్ లు యాకస్వామి, సదానందం, హెల్త్ అసిస్టెంట్లు బద్రు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, ఏఎన్ఎంలు రజిత, జ్యోతి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.