పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ
వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. చెట్ల పెంపకంపై ప్రజలు చైతన్యం కావాలన్నారు.  ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి జూపార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవాళికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌ వాడకాన్ని అందరూ ఆపేయాలని ఆయన చెప్పారు. ప్లాస్టిక్‌తో ముప్పు కొని తెచ్చుకోవద్దన్నారు.  కార్యక్రమంలో వరంగల్‌ ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎం.జె.అక్బర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ డీఎఫ్‌వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.