పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం
నిజామాబాద్,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి భూమి పూజ చేశారు. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్`2కాలనీలో పట్టణ ప్రకృతి వనానికి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారితో కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.