పలు జిల్లాల్లో తెదేపా ఆందోళన

హైదరాబాద్‌ : కళంకిత మంత్రుల వ్యవహారంపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఆ పార్టీ నేతలు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. చిత్తూరు, ఆదిలాబాద్‌, అనంతపురం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ధర్నా, రాస్తారోకోలు చేశారు. వెంటనే కళంకిత మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.