పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం  కల్పించాలని ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో విభేధాలు తెలుసుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రజలతో సమన్వయంగా ఉంటూ యువకులకు ఉపాధి మార్గం చూపాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన యువకులకు హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. గ్రామాల్లో దేశీదారు, మట్కా, జూదం, ఇతర చెడు వ్యసనాలను అరికట్టాలన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో నలుగురు సభ్యుల నిఘా వ్యవస్థ ఏర్పరచుకోవాలన్నారు. పోలీసు స్టేషన్‌లో సిబ్బంది పూర్తి యూనిఫాంలో సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మహేశ్వరరాజు , స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ భీమన్న, ఎస్సైలు పుల్లయ్య, వెంకటస్వామి , శ్రీనివాస్‌ , కృష్ణామూర్తి , రాజన్నలు పాల్గొన్నారు.