పల్లె దవఖానాల ఏర్పాటు అభినందనీయం

కలకోవ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు

మునగాల, డిసెంబర్ 03(జనంసాక్షి):

కలకోవ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకు సహకరించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు కలకోవ గ్రామ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు శనివారం తలకోవా గ్రామంలో ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు వైద్యం సకాలంలో అందాలనే ఉద్దేశంతో, కార్పొరేట్ వైద్యమును పొందలేక గ్రామీణ పేదలు చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆర్థికంగా చితికిపోయి జీవనం కొనసాగిస్తున్న వారందరిని చూసి చలించి ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని ఆకాంక్షించి ప్రతి ఊరిలో వైద్యం కోసం పక్కా బిల్డింగు హాస్పిటల్ ఉండాలననే ఆలోచనను ఆకాంక్షిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షించదగినది అని అన్నారు. ఈ విషయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పట్టుదల, కృషితో కలకోవ గ్రామానికి ఆరోగ్య ఉపకేంద్రము కొరకు పక్కా బిల్డింగు మంజూరు చేయించినందుకు కలకోవ  గ్రామపక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గన్న భవాని నరసింహారావు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొంపెల్లి వీరబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాలకవర్గం వార్డు సభ్యులు మునగలేటి వీరబాబు, సిర్ర నిర్మల వీరబాబు, కోఆప్షన్ సభ్యులు పనస వీరయ్య, మండవ సైదులు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అనంతు శ్రీను, నాయకులు తిప్పని వీరయ్య, తొండల లింగయ్య, మునగలేటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.