పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా కలెక్టర్ తనిఖీ లు యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా 7వ రోజు జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి బొమ్మల రామారం మండలం రామ లింగంపల్లి గ్రామాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెరుగుదల పై సిబ్బందికి కొన్ని సూచనలు చేసారు.  గ్రామ పరిధిలో హరితహారం మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలు గుర్తించాలని, మొక్కలు నాటేందుకు కార్యాచరణ తయారు చేయాలని, గతంలో మొక్కలు నాటిన వాటిలో చనిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, అన్ని మొక్కలకు ట్రీ గార్డులు ఉత కర్రలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు . తరువాత రామలింగంపల్లి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోసి మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమo  మొదలైనప్పటి నుండి   పల్లెలు  శుభ్రంగా ఉండటంతో అంటూ వ్యాధులు ప్రభలకుండా ఉన్నాయని  కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యంజాల కళ , ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి ,ఎంపీటీసీ హేమంత్ రెడ్డి , ఎంపీఓ వెంకటేశ్వర్లు,సెక్రటరీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.