పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో బాగంగా చివరి రోజు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో నడుస్తున్న పనులను పరిశీలించి గ్రామ అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు ఇస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. తదుపరి జిల్లా కలెక్టరు పటేల్ గూడెం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠాశలను తనిఖీ చేసి, పాఠశాలలలో మైదానం ఉన్నందున పెద్దగా పెరిగే చెట్ల తో పాటు పూల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని హెడ్ మాస్టర్ ను ఆదేశించారు.మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా పిల్లలకి అందిస్తున్న మధ్యన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల అన్ని గదులను పరిశీలించి కొన్ని గదులలో ఫ్యాన్లు లేకపోవడం పై ఏర్పాటు చేయవలసిందిగా ఎంపిడిఓ ను ఆదేశించగా వారు వెంటనే స్పందించి ఏర్పాటు చేయడం జరిగింది. తరగతి గదులలో ఉన్న పిల్లలతో కలెక్టరు మాట్లాడారు. పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. గ్రామంలో నడుస్తున్న అంగన్ వాడి కేంద్రం పై , పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన వసతులు పై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎంపిడిఓ జ్ఞాన ప్రకాష్ , ఎంపీవో సలీమ్, హెడ్ మాస్టర్ జ్యోతిర్మయి, సంబంధిత సిబ్బంది ఉన్నారు.