పల్లె ప్రగతి తో అధికారులు అలర్ట్

పల్లె ప్రగతి తో అధికారులు అలర్ట్
 పిట్లం జూన్ 8(జనం సాక్షి )
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు సమయపాలన పాటిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అహర్నిశలు కష్టపడతారు. స్పెషల్ ఆఫీసర్ గా  అధికారులను నియమించి మండలంలో ఏ పని చేయకుండానే అధికారులు సమయపాలన పాటించడం కష్టంగా మారింది. పల్లె ప్రగతి కార్యక్రమానికి ఉదయం నుంచే విధులకు హాజరై పనులు చేపిస్తున్నారు. అంగన్వాడి టీచర్ నుండి ఉన్నత అధికారుల వరకు అలర్ట్ అవుతున్నారు. బుధవారం నాడు పిట్లం మండలానికి కలెక్టర్ వస్తున్నాడని సమాచారం మేరకు అధికారులు కార్యాలయాలలో పడిగాపులు కాశారు. మండల కేంద్రంతో తో పాటు అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచుల సహకారంతో కార్యదర్శులు మురికి కాలువలు, చెట్ల పొదలు, పెంట కుప్పలు, తీయించారు. రాంపూర్ గ్రామంలో వైకుంఠ గ్రామం లో పిచ్చి మొక్కలు  తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎం పి ఓ బ్రహ్మం, ఏపీవో శివకుమార్, స్పెషల్ ఆఫీసర్ రవళిక, కార్యదర్శులు యాదగిరి, వినోద్, ప్రవీణ్ పాల్గొన్నారు.