పల్లె ప్రగతి తో గ్రామాల అభివృద్ధి.
* జెడ్పిటిసి సాగర్.
చిట్యాల7( జనం సాక్షి) పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు .మంగళవారం చైన్ పాక గ్రామంలో జడ్పిటిసి గొర్రె సాగర్ ఐదవ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ప్రభుత్వ పాఠశాల పరిశుభ్రతలో పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అదే గ్రామానికి చెందిన ఉపాధిహామీ పనుల వద్ద కూలీలతో సంభాషించారు. అనంతరం ఈ సందర్భంగా జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రం, పచ్చదనంగా ఉండడమే కాకుండా సమస్యలకు పరిష్కారాలు లభిస్తున్నాయన్నారు. పల్లె ప్రగతిని నిరంతర కార్యక్రమంగా మలిచి గ్రామాల్లో నిత్యం చెత్త సేకరణ, నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణిగుంట్ల స్వరూప సదానందం, ఎంపీటీసీ భూక్య సుజాత రాజు పంచాయతీ కార్యదర్శి ,ఎస్టీ సెల్ మండల ప్రెసిడెంట్ అజ్మీరా నందు నాయక్, ఉపసర్పంచ్ మేకల రాజేందర్, మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, తెరాసా గ్రామ శాఖ అధ్యక్షులు పల్లే శశిధర్ రెడ్డి,వార్డ్ సభ్యులు బొజ్జపెళ్ళి వినోద్, బొజ్జపెళ్లి శ్రీనివాస్, పల్లె రమణారెడ్డి, మేకల దేవేందర్, బాలకృష్ణ ,ఎరుకొండ ఐలయ్య, సంతోష్ ,ఏళ్ళవెన ప్రభాకర్, ఓదెల మల్లు తదితరుల పాల్గొన్నారు.